మా జాతి బానిసలుగా బతకాలా ?

మా జాతి బానిసలుగా బతకాలా ? అంటూ ఏపీ సీఎం జగన్ ని ప్రశ్నించారు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. అగ్రవర్ణపేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది సాధ్యం కాదని, కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్ల అమలు కుదరదని జగన్ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు.

“కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్ల అమలు కుదరదన్నట్లు పత్రికల్లో చదివానని, అయితే ఎక్కడ స్టే ఇచ్చారో అసెంబ్లీలోగానీ, మీడియాతోగానీ చెప్పి ఉంటే సంతోషించేవాడినని అన్నారు. నిజంగా కోర్టులో స్టే ఉంటే మళ్లీ ఎన్నికల వరకు నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటామని ముద్రగడ స్పష్టం చేశారు. మీరు ఇస్తానన్న రూ.2 వేల కోట్లకు ఆశపడి ఓట్లు వేశారని భావిస్తున్నారా ?అని సీఎంను ప్రశ్నించారు. మా జాతి బానిసలుగా బతకాలని మీ అభిప్రాయమా?”అంటూ లేఖలో ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు.