మన్మథుడు 2 : ‘నాలోనా.. నీవేనా..’ లిరికల్ సాంగ్

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 9న మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ‘నాలోనా.. ‘ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం.

శుభం విశ్వనాథ్ రాసిన ఈ పాటని చిన్మయి శ్రీపాద పాడారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మెలోడి సాంగ్ చాన్నాళ్లు గుర్తిండిపోయేలా ఉంది. ఈ సంవత్సరం వచ్చిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచేలా ఉంది. ఈ లిరికల్ సాంగ్ ని మీరు వినేయండీ.. !