‘అధీరా’గా సంజయ్ దత్ !


ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. విడుదలైన ప్రతిచోట మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ కేజీఎఫ్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారని సమాచారమ్. ఇటీవల విడుదల చేసిన ‘అధీరా’ ప్రీ లుక్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దే. ఇప్పుడీ లుక్ ని పూర్తిగా రివీల్ చేసింది చిత్రబృందం. వెనుక భారీ సైన్యంతో తలపాగాతో కూడిన ముసుగు ధరించిన సంజయ్ దత్ కిల్లర్ లుక్స్ భయంకరంగా ఉన్నాడు. ఆయన సినిమాలో ప్రధాన విలన్ గా కనిపించబోతున్నారు.

తొలి భాగంలో గరుడను అంతం చేసిన రాఖీ, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. చివరకు ఏమయ్యాడు? అన్న విషయాలను రెండో భాగంలో చూపించబోతున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది. ఈ యేడాది చివర్లో కేజీఎఫ్ 2 విడుదల కానుంది. ఇక, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండనుందనే ప్రచారం జరుగుతోంది.