బిగ్ బాస్ హౌస్’లో తమన్నా హవా


బిగ్ బాస్ హౌస్’లో తమన్నా హవా మొదలైంది. తొలివారంలోనే బిగ్ బాస్ బిగ్ సప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్’లోకి తమన్నాని తీసుకొచ్చాడు. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్’లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం రాత్రే ఆమె హౌస్’లోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రోమోని కొద్దిసేపటి క్రితమే స్టార్ మా విడుదల చేసింది.

ఎంట్రీతో హౌస్ సభ్యులకి షాక్ ఇచ్చింది తమన్నా సింహాద్రి. తనదైన స్టయిల్ లో డ్యాన్స్ చేస్తూ.. ‘పిక్చర్ అబీ బాకీ హై దోస్త్’ అంటూ సందడి చేసింది. తెలుగు బిగ్ బాస్ హౌస్’లోకి ట్రాన్స్ జెండర్ ని తీసుకోవడం ఇదే తొలిసారి. ఇక, తొలివారం హౌస్ నుంచి హేమ ఎలిమినేట్ అయింది. ఆమె స్థానంలో తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించారు. దీంతో హౌస్ లో మళ్లీ 15మందిని ఉంచినట్టయింది.

హోస్ట్ గా నాగార్జున తనదైన శైలిలో షోని నడిపిస్తున్నారు. గతంలో మాదిరిగా గొడవలపై డిస్కషన్స్ పెట్టడం లేదు. వరుణ్ తేజ్ భార్య వితికా వర్సెస్ మహేష్ విట్టా గొడవని నాగ్ లైట్ తీసుకొన్నారు. బహుశా.. సెన్సిటివ్ అంశం కావడంతో నాగ్ హైడ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు హౌస్ లోని మిగితా గొడవలని నాగ్ చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే.. స్పైసీ మిస్సవుతుందేమో.. !