‘డియర్ కామ్రేడ్’ చెడగొట్టింది విజయ్ నే.. !!

విజయ్ దేవరకొండ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ ప్లాప్ కి ఆయనే బాధ్యుడనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. దీనికి బలమైన కారణాలున్నాయి. ఈ చిత్రానికి అంతా తానై చూసుకొన్నాడు విజయ్. స్క్రిప్ట్ లో మార్పులు, రీషూట్ లే కాదు, డైరక్టర్ ను పక్కన కూర్చోపెట్టి, డైరక్షన్ కూడా చేసేసుకున్నాడని గుసగుసలు వినిపించాయి. అతిపెద్ద మైనస్ గా చెబుతున్న సినిమా లెన్త్ ని పెంచింది విజయ్ నే. రెండున్నర గంటలుగా కట్ చేసిన సినిమాని విజయ్ కలుగు చేసుకొని మరో 15-20నిమిషాలు పెంచేశాడు.

ఇప్పుడు అదే పెద్ద మైనస్ అయింది. సినిమా బాగుంది. కానీ స్లోగా ఉంది. కాస్త లెన్త్ తగ్గిస్తే ‘డియర్ కామ్రేడ్’ ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారి. ఇది కచ్చితంగా విజయ్ చేసిన తప్పే. ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూర్చోని సన్నివేశాలని పెంచుకొంటూ వెళ్లాడు. అది సినిమా ప్లేవర్ ని చెడగొట్టింది. ఐతే, దానికి విజయ్ ఏమి బాధపడటం లేదు. ఈ కథని మేం ఇలాగే చెప్పాలనుకొన్నామని సక్సెస్ మీట్ లో అన్నారు. ఈ సినిమాకైతే నడిచింది. ప్రతి సినిమాలోనూ ఇలాగే వేలు పెడితే.. ఆయనకే నష్టమేమో.. !