దిల్ రాజుని పట్టించుకోని విజయ్ !


నిర్మాత దిల్ రాజు లెక్కలు పక్కాగా ఉంటాయి. ఆయన బ్యానర్ లో సినిమా అంటే మంచి స్క్రిప్ట్, మంచి కాంబినేషన్, మంచి రిలీజ్ డేట్ సెట్ చేస్తారు. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పట్టుబట్టీ మరీ.. ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం దిల్ రాజుని నిర్మాతగా చేర్చుకొన్నారు. నాని, శర్వానంద్, నితిన్, సుధీర్ బాబ్.. లాంటి సెకండ్ గ్రేడ్ హీరోలు దిల్ రాజుతో సినిమా అంటే అస్సలు కాదనరు. ఐతే, ఇందుకు భిన్నంగా దిల్ రాజుతో సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ ఆసక్తి చూపకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఓ సినిమా చేద్దామని విజయ్ దేవరకొండని స్వయంగా దిల్ రాజు అడిగారట. దానికి విజయ్ ఎస్ అనిగానీ నో అనిగానీ చెప్పకుండా నానుస్తూ ఉన్నారట. ఓ డైరక్టర్ కూడా దిల్ రాజు-విజయ్ కాంబినేషన్’లో సినిమా చేయాలకున్నారు. దానికి విజయ్ ఓకే చెప్పడం లేదు. అంతేకాదు.. వేరే బ్యానర్ లో అయితే చేద్దామనే హింట్ ఇస్తున్నాడట. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడం విజయ్ కి ఇష్టం లేనట్టు కనబడుతోంది. అదే ఎందుకు ? అనేది మాత్రం తెలియడం లేదు. బహుశా.. గతంలో దిల్ రాజు విజయ్ ని డీప్ గా హర్ట్ చేసి ఉంటాడేమో.. !