మరో సింగిల్ టేక్ రికార్డు


టాలీవుడ్ లో సరికొత్త రికార్డు తెరపైకి వచ్చేసింది. అదే సింగిల్ టేక్ రికార్డ్. సింగిల్ టేక్ లో యంగ్ హీరోలు స్టార్ హీరోలకి సవాల్ విసురుతున్నారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో సింగిల్ టేక్ లో ఓ సాంగ్ తీశారు. అదే క్యాంటీన్ సాంగ్. దీనిపై విజయ్ ఫ్యాన్స్ గొప్పగా మాట్లాడుకొన్నారు. ఇక ‘కొబ్బరిమట్ట’ సినిమాలో ఏకబిగిన 3 నిమిషాల డైలాగ్ చెప్పి నోరెళ్లబెట్టేలా చేశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలోనైతే 10 నిమిషాల క్లైమాక్స్ సీన్ ను సింగిల్ కట్ లో తీశారు.

ఇప్పుడు అలాంటిదే మరో సింగిల్ టేక్ షాట్ తెరపైకి రాబోతోంది. తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్నసినిమాలో 3 నిమిషాల యాక్షన్ సన్నివేశం ఒకటి ఉండబోతోంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.మెహ్రీన్ హీరోయిన్. ఆ సింగిల్ టేక్ యాక్షన్ సీన్ లో నటించబోయే నాగశౌర్య ప్రమాదానికి గురయ్యాడు. కోలుకొని మళ్లీ అవే యాక్షన్ సీన్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న అన్బు అరివు, ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి “అశ్వద్ధామ” పరిశీలనలో ఉంది.