‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ మారనుందా ?

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మెగా యంగ్ హీరోలకి దక్కని అదృష్టం నానికి మాత్రమే దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’గా కనిపించాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటుగా చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. ఆశపడ్డారు. కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలోనే నాని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పై మెగా హీరోలు మండిపడ్డారు. ఆ టైటిల్ ని వాడుకొనే అర్హత నానికి లేదని కామెంట్స్ చేశారు. ఐతే, అవేవి పట్టించుకోకుండా నాని ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

ఇలాంటి టైమ్ లో గ్యాంగ్ లీడర్ కి ఝులక్. టైటిల్ మార్చుకోక తప్పని పరిస్థితి. దీని వెనక మెగా హీరోల హస్తం ఉందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ? మైత్రీ మూవీస్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకోవడానికంటే ముందే ఓ చిన్న నిర్మాణ సంస్థ గ్యాంగ్ లీడర్ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకొంది. ఈ నేపథ్యంలో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ని కాస్త ‘నాని గ్యాంగ్ లీడర్’ లీడర్ మార్చాలనే ఆలోచనలో మైత్రీ మూవీస్ ఉన్నట్టు సమాచారమ్. మొత్తానికి.. మెగా హీరోల కడుపుమంట చల్లారినట్టయింది.

ఇక, ఆగస్టు 30న రావాల్సిన ‘గ్యాంగ్ లీడర్’ ఆ రోజున ప్రభాస్ ‘సాహో’ వస్తుండటంతో సెప్టెంబర్ కి వాయిదా పడనుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 13న నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారమ్.