రకుల్ జుట్టుపట్టి మరీ.. !


జుట్టుపట్టి మరీ.. కొట్టారు ! అని చెప్పుకొంటాం. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేసింది. ఆమె తన జుట్టు పట్టుకొని మరీ.. హాటు పోజులిచ్చింది. అది ప్రేక్షకులని గ్లామర్ తో కొట్టినట్టుంది. ఇప్పుడీ పోజుని చూసి రకుల్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. రకుల్ అందాలకి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’లో హాటు హాటుగా కనిపించింది రకుల్. బ్రా అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని బుట్టలో వేసుకొంది. ఆ ఎఫైక్ట్ తో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకొంటోంది.

‘మన్మథుడు 2’లోనూ రకుల్ హాట్ గా కనిపించబోతుంది టీజర్, ట్రైలర్ తో అర్థమయింది. కాస్త ఎక్కువ రేటు తీసుకొన్న దే దే ప్యార్ దే సినిమాలో కనిపించినట్టుగా మన్మథుడు2లోనూ బ్రా అందాలతో కనువిందు చేయనుంది. ఈ నెల 9న మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునతో రకుల్ తొలిసారి కలిసి నటించింది. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. మన్మథుడు 2 హిట్టయితే.. టాలీవుడ్ లో మళ్లీ రకుల్ హవా మొదలైనట్టే.. !