బెల్లకొండకు సీత కష్టాలు
యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ కు ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. చేసిన సినిమాలన్నీ ప్లాపులే. ‘అల్లుడు శ్రీను’ నుంచి ‘కవచం’ వరకు ఒక్కటి హిట్ అనిపించుకోలేదు. కానీ, ఆయన నుంచి వరుసగా సినిమాలొస్తున్నాయ్. బెల్లంకొండతో సినిమా చేసేందుకు నిర్మాతలు
ముందుకొస్తున్నారు. దానికి కారణం హిందీ రైట్స్. బెల్లంకొండకు పెద్ద అండ హిందీ డబ్బింగ్, డిజిటల్ మార్కెట్. అక్కడ నుంచి ప్రతి సినిమాకు పది పన్నెండు కోట్లు ఆదాయం నిర్మాతకు వస్తుంది. అందుకే చాలామంది నిర్మాతలు బెల్లంకొండతో సినిమా నిర్మాణానికి ముందుకొచ్చిన సందర్భాలున్నాయి. ఐతే, ఇప్పుడు ఆ మార్కెట్ కే తూట్లు పడుతున్నట్లు సమాచారమ్.
యాక్షన్ హీరోలకి, యాక్షన్ సినిమాలకి హిందీ మార్కెట్ బాగుంటుంది. బెల్లకొండకు మాస్, యాక్షన్ హీరో అనిపించుకోవడానికి అన్నీ అర్హతలున్నాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ హైలైట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే బెల్లకొండ సినిమాకు హిందీ డబ్బింగ్ రూపంలో రూ. 12కోట్ల వరకు వచ్చాయ్. ఐతే, ‘సీత’ సినిమాతో ఆ లెక్కలు తప్పాయ్. సీత సినిమాలో ఆరు ఫైట్లు వుంటాయని చెప్పారని, కానీ రెండు ఫైట్లే వున్నాయని.. బయ్యర్ పంచాయతీ పెట్టారు. చివరి నిమిషంలో కోటి నుంచి రెండు కోట్ల వరకు తక్కువ కట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాక్షసుడు విషయంలోనూ అదే జరిగినట్టు తెలుస్తోంది. రూ. 12కోట్ల వరకు పలకాల్సిన రాక్షసుడు హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 8కోట్లకి బేరం అయినట్టు తెలుస్తొంది. ఈ ఎఫెక్ట్ బెల్లకొండ తదుపరి సినిమాలపై పడటం ఖాయం అంటున్నారు.