హీరోయిన్’తో ఎరవేసి.. రూ.60లక్షలు టోకరా !
ఆన్ లైన్ మోసాలకి బలవుతున్న యువతని చూస్తున్నాం. తాజాగా మరో ఆన్ లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ పారిశ్రామికవేత్త 27 ఏళ్ల కుమారుడికి హీరోయిన్ ని ఎరవేసి రూ. 60లక్షలు గుంజారు. ఆ పైన బెదిరింపులకి పాల్పడటంతో అతడు ఆత్మహత్య చేసుకొనేందుకు రెడీ అయ్యారు. ఇంతలో అదృష్టం బాగుండి బతికి బటయపడ్డాడు.
వివరాల్లోకి వెఌతే.. ఓ పారిశ్రామికవేత్త 27 ఏళ్ల కుమారుడు కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో ఓ పేజ్‌లో సినీ నటిని కలవానుకుంటే ఆ సదుపాయం కల్పిస్తామని అసభ్య చిత్రాలతో కూడిన సందేశం కనిపించింది. అది చూసిన యువకుడు తన పూర్తి వివరాలు నమోదు చేశాడు. ఏ సినీనటిని కలవాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న వద్ద ఓ నటి పేరు ఎంచుకుని రూ.50వేలు చెల్లించాడు. ఫోన్‌కు లావాదేవీ పూర్తి అయినట్టు సందేశం కూడా వచ్చింది. ఆ తర్వాత యువకుడికి మాయగాళ్ల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
బ్లాక్ మెయిల్ తో విడతలవారీగా రూ. 60లక్షలు గుంజారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోల్‌కతాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసుల సాయంతో రక్షించారు. చివరికి నిందితుడు శరవణకుమార్ (37) పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.