తొలి ‘హిట్ కిక్కు’లో బెల్లకొండ !
హిట్ ఇచ్చే కిక్కే వేరబ్బా. ఇప్పుడీ కిక్కులోనే ఉన్నాడు యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు. స్వీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో నటించాడు. అన్నీ సినిమాలకి భారీగానే ఖర్చుపెట్టారు. స్టార్ హీరోయిన్, స్టార్ కాస్ట్ ని తీసుకొన్నారు. కానీ, హిట్ దక్కలేదు. ఫైనల్ గా ‘రాక్షసుడు’తో బెల్లకొండ హిట్ దాహం తీరింది. ఇది తమిళ్ హిట్ రాక్షసన్ కి రిమేక్.
రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు కథ-కథనంలో పెద్దగా మార్పులేమీ చేయకుండా.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాడు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని బాగా డీల్ చేశాడు. గత సినిమాలకి భిన్నంగా బెల్లకొండ పాత్రలో లీనమైన నటించారు. ఫలితంగా రాక్షసుడు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. హిట్ టాక్ సొంతం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్రబృందం సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకొంది. దీనికోసమే రెండేళ్ల నుంచి కష్టపడుతున్నానని బెల్లకొండ శ్రీనివాస్ అన్నారు. తన కొడుక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందించినందుకు దర్శక-నిర్మాతలకి థ్యాక్స్ చెప్పారు బెల్లకొండ సురేష్. మొత్తానికి.. బెల్లకొండ ఖాతాలో తొలి హిట్ పడింది. ఇకపై ఆయన ఖాతాలో మరిన్ని హిట్స్ పడాలని ఆశిద్దాం.