బ్రేకింగ్ : బిగ్ బాస్ హౌస్ నుంచి జాఫర్ అవుట్

ఊహించినదే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. రెండోవారం ఎలిమినేషన్ లిస్టులో ఏకంగా 8మంది ఉన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేశ్ విట్టా, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. ఐతే వీరిలో వితికా, జాఫర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. కొన్ని వెబ్ సైట్స్ మాత్రం రెండోవారం కచ్చితంగా జాఫర్ ఎలిమినేట్ కాబోతున్నారని చెప్పాయి. ఇప్పుడదే జరిగింది.

ఎలిమినేషన్ లిస్టులో ఉన్న మొత్తం 8మందిలో వితికా, జాఫర్ ఎలిమినేషన్ చివరికి వరకు వెళ్లింది. ఫైనల్ గా జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ నుంచి వెళ్లేముందు జాఫర్ ఎమోషన్ అయ్యారు. ఏడుస్తూ.. బాబా భాస్కర్ గురించి అలా అనొద్దు అంటూ వరుణ్ కి చెబుతూ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక, ఆదివారం బిగ్ బాస్ షోకి ఇస్మార్ట్ శంకర్ రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు. హౌస్ సభ్యులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.