వైరల్ : ‘మన్మథుడు2’ 2.ఓ వాట్సాప్ స్ట్రిక్కర్స్


రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. ఇది ‘మన్మథుడు’ సినిమాకి సీక్వెల్ భావిస్తున్నారు ప్రేక్షకులు. ఐతే, కథ, కథనంలో మన్మథుడుతో పోలికే ఉండదు. కానీ, వినోదం మాత్రం ఆ రేంజ్ లో ఉంటుందని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక రెండో మన్మథుడు ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వినూత్నంగా చేపడుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున, రకుల్‌, వెన్నెల కిషోర్‌ల వాట్సాప్‌ స్టిక్కర్లను విడుదల చేసింది. ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చాలామంది వాట్సాప్‌లలో ఇవే చక్కర్లు కొడుతున్నాయి.

‘మన్మథుడు 2’ ఓ ఫ్రెంచ్ సినిమాకు రిమేక్. నాగ్ కి జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించింది. కీర్తిసురేష్‌, సమంత అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి.