#RRR అదిరిపోయే అప్ డేట్


#RRR నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉన్న పిక్ ఒకటి బయటికొచ్చింది. ఈ పిక్ ని రామ్ చరణ్ తన ఇన్ స్ట్రో గ్రామ్ లో పోస్ట్ చేశారు. #RRRYehDosti యాష్ ట్యాగ్ ని జత చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#RRRలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఫిక్సయిపోయారు. తారక్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ అనే బ్రిటిష్‌ భామను ఎంపికచేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా ప్రారంభానికి ముందే తప్పుకొన్నారు. అప్పట్నుంచి తారక్ కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు జక్కన్న. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లని పరిశీలించారు. ఫైనల్ గా హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు రూ.400కోట్లపైగా బడ్జెట్’తో డీవీవీ దానయ్య సినిమాకు నిర్మిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.