‘రాక్షసుడు’కి థియేటర్లు పెరిగాయ్ !

రాక్షసుడుగా మారి హిట్ కొట్టాడు యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్. రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తమళ్ హిట్ చిత్రం రాక్షసన్ కి రిమేక్ ఇది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాక్షసుడు’ హిట్ టాక్ సొంతం చేసుకొన్నాడు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారం కలెక్షన్స్ అదిరిపోయాయ్. అంతేకాదు.. రాక్షసుడుకు అదనంగా థియేటర్స్ యాడ్ అయ్యాయి. సినిమా బాగుండటం, పోటీలో మరో సినిమా లేకపోవడం రాక్షసుడుకు కలిసొచ్చింది.

‘రాక్షసుడు’కు పోటీగా ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే ఉన్నాడు. జులై 18న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ని చూసేసిన ప్రేక్షకులకి మరో ఆప్షన్ లేకుండా పోయింది. ‘డియర్ కామ్రేడ్’ ఉన్నా.. బోరింగ్ అని అటు వైపు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో రాక్షసుడు థియేటర్స్ నిండిపోతున్నాయి. దీంతో అదనంగా కొన్ని థియేటర్స్ లో విడుదల చేశారు. ఇక ఈ వీకెండ్ రాక్షసుడుదే హవా. ఎన్ని కోట్లు దండుకుంటాడనేది చూడాలి.