జమ్మూకశ్మీర్’లో ఆర్టికల్370 రద్దు


జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏల లని రద్దు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేడు రాజ్యసభలో కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులోని సవరణలను సభలో వినిపించారు. ఆర్టికల్‌ 370ను తొలగిస్తున్నామని సవరణ ప్రవేశపెట్టినట్లు అమిత్‌షా చెప్పారు.

అలాగే ఆర్టికల్‌ 35ఎను రద్దు చేస్తూ రెండవ సవరణను ప్రవేశపెట్టారు. అమిత్‌షా ప్రకటనపై విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. విపక్షాల నినాదాల మధ్యే బిల్లు సభ ఆమోదించింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్ కోవింద్ ఈ బిల్లుని ఆమోదించారు. క్షణాల్లోనే గెజిట్ విడుదల చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన తాజా బిల్లుతో జమ్మూకశ్మీర్ మూడు ముక్కలైంది. రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన. అసెంబ్లీ కూడిన కేంద్ర ప్రాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్. లడఖ్ ని సపరేటు కేంద్రం పాలిత ప్రాంతంగా విభజించారు.