‘ఆర్టికల్370 రద్దు’తో జమ్ము-కశ్మీర్’లో వచ్చే మార్పులివే.. !

జమ్ము కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసింది. అదే సమయంలో రాష్ట్రాన్ని విభజించి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. జమ్ము-కశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 370ను రద్దు చేయడంతో జమ్ము కశ్మీర్‌లో చోటుచేసుకోనున్న ప్రధాన మార్పులపై ఓ లుక్కేద్దాం.. !

* ఇప్పటి వరకూ రాష్ట్రంగా కొనసాగుతున్న జమ్ము కశ్మీర్‌.. కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది.

* ఢిల్లీ, పుదుచ్ఛేరి తదితర కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగా దీనిపై కేంద్రానికి విశేష అధికారాలు ఉండనున్నాయి

* ఇకపై పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్ముకశ్మీర్‌లో అమలు కానుంది.

* జమ్ము కశ్మీర్‌కు అసెంబ్లీ ఉన్నప్పటికీ.. ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగానే పోలీసు యంత్రాంగం, భూముల నిర్వహణపై ఎలాంటి అధికారాలు ఉండవు.

* కేంద్ర హోంశాఖ నియంత్రణలో విధులు నిర్వర్తించే ఎల్జీకి స్థానిక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అంతిమ పాలనాధికారం ఉంటుంది. ప్రతి అంశంలో కేంద్ర హోంశాఖకు విశేష అధికారులు ఉంటాయి

* జమ్ముకశ్మీర్‌లో ఇప్పటి వరకూ శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల విక్రయాలు చేపట్టే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా జమ్ము కశ్మీర్‌,లద్దాఖ్‌ ప్రాంతల్లో భూములను కొనుగోలు చేయొచ్చు. అమ్మొచ్చు.

* అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ ఏర్పాటు చేశారు

* లద్దాఖ్‌ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలంటూ ఉండవు. లోక్‌సభ ఎన్నికల మాత్రమే ఉంటాయి

* లద్దాఖ్‌ ప్రాంతానికి జమ్ము కశ్మీర్‌తో సంబంధాలు ఉండవు. ఈ ప్రాంత అభివృద్ధిలో నేరుగా కేంద్రం జోక్యం ఉండనుంది