మన్మథుడు 2 ‘Cast and Crew’పై నాగ్ కామెంట్స్ (వీడియో)

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అదించారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. ఈ శుక్రవారం (ఆగస్టు9) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. స్వయంగా నాగ్ రంగంలోకి దిగారు.

తాజాగా మన్మథుడు 2 Cast and Crew గురించి నాగ్ ప్రత్యేకంగా మాట్లాడిన వీడియో ఒకటి విడుదల చేశారు. ఇందులో సినిమా కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషన్స్ గురించి నాగ్ గొప్పగా మాట్లాడారు. అందురు బాగా పని చేశారు. మంచి అవుట్ పుట్ నిచ్చారని చెప్పుకొచ్చాడు. ఇక, మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా భావిస్తున్న మన్మథుడు 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలని రెండో మన్మథుడు ఏ మేరకు అందుకుంటాడనేది చూడాలి.