‘మన్మథుడు 2’ ప్రీ-రిలీజ్ బిజినెస్ డిటేల్స్


రొమాన్స్ చేయడానికి, ముద్దులు పెట్టడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు కింగ్ నాగార్జున. ఆయన తాజా చిత్రం మన్మథుడు 2లో రొమాంటిక్ గా కనిపించాడు. టీజర్, ట్రైలర్ లోనే లిప్ కిస్సులతో రచ్చ చేశాడు. ఇక సినిమాలో నాగ్ రొమాంటిక్ యాంగిల్ ని పూర్తి స్థాయిలో చూడబోతున్నాం. ఈ శుక్రవారమే మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది. ఏకంగా రూ. 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియాలవారీగా చూస్ట్.. నైజాం రూ 7 కోట్లు, సీడెడ్ రూ. 2.5 కోట్లు, ఆంధ్ర రూ. 7కోట్లు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.40 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా మన్మథుడు 2 ఖాతాలో రూ. 20కోట్లు పడ్డాయి. మరీ.. ఆ మొత్తానికి ఎన్ని రోజుల్లో తిరిగి తీసుకొస్తాడు ? ఎంత లాభాలు మిగులుస్తాడు ?? అన్నది చూడాలి.