విజయ్ దేవరకొండతో పూరి సినిమా ఫిక్స్ !


ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. తిట్లనే టైటిల్స్ గా పెట్టి ట్రెండ్ చేసిన ఘనత ఆయనది. ఇడియట్, దేశముదురు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నాడు. అసలు సిసలు హీరోయిజం చూడాలంటే పూరి సినిమా చూడాల్సిందే. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో హీరోయిజంని ప్రజెంట్ చేయడం పూరి ప్రత్యేకత. అందుకే పూరితో సినిమా చూసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. ఐతే, అదంతా గత వైభవం. ‘టెంపర్’ తర్వాత పూరి గ్రాఫ్ దిగజారింది.

ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్స్, యంగ్ హీరోలు సైతం మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో పూరి కసిగా చేసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. మరోసారి పూరి మార్క్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత పూరి ఏ హీరోతో చేస్తారా ? ఎలాంటి సినిమా చేయబోతున్నారు ?? అనే ఆసక్తి నెలకొంది. పూరి నెక్ట్స్ సినిమా విజయ్ దేవరకొండ తో ఫిక్స్ అయినట్టు సమాచారమ్.

పూరి కథని విజయ్ ఓకే చేశాడు. నిర్మాత ఎవరు ? అనేది తేలాల్సి ఉంది. మైత్రీమూవీస్ ఇందుకు రెడీగా వుంది. కానీ పూరి జగన్నాధ్ కు రెండు కండిషన్లు వున్నాయి. ఒకటి తమ బ్యానర్ యాడ్ అవ్వాలి. అలాగే సినిమా నిర్మాణ బాధ్యతలు చార్మికి ఇవ్వాలి. ఒకట్రెండు రోజుల్లో పూరి-విజయ్ సినిమాపై స్పష్టత రానుంది.