రేణుదేశాయ్ సెకండ్ మ్యారేజ్ క్యాన్సిల్ ?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల క్రిందటే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత పెళ్లి అప్ డేటు రాలేదు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? రేణు రెండో పెళ్లి విషయంలో మనసు మార్చుకొన్నట్టు సమాచారమ్. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రేణు టీవీ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
త్వరలో పూణె నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ కాబోతున్నట్టు తెలిపింది. రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాకి రేణు దర్శకత్వం వహించబోతున్నా. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. దీనికితోడు మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వాలనుకొంటున్నా. ఈ నేపధ్యంలో కథలు వినడానికి షూటింగ్ కు అందుబాటులో ఉండటానికి హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలని నిర్ణయించుకొన్నట్టు రేణు చెప్పుకొచ్చారు.
ఇక, రెండో పెళ్లి విషయంపై స్పందించేందుకు రేణు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో ఆమె రెండో పెళ్లి ఆలోచన విషయంలో మనసు మార్చుకొంది. అంతేకాదు.. పవన్ సూచన మేరకే ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ కాబోతుందనే కామెంట్స్ విపిస్తున్నాయి. నిజంగానే రేణు రెండో పెళ్లిని రద్దు చేసుకొంటే.. పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతారు. రెండో పెళ్లి విషయంలోనే రేణు-పవన్ అభిమానుల మధ్య వార్ కొనసాగిన సంగతి తెలిసిందే.