షాక్ : సోనాక్షి సిన్హా అరెస్ట్


బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెని బేడీలు వేసి ఈడ్చుకొని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనాక్షి చేతులని బలవంతంగా వెనక్కి లాగి బేడీలు వేశారు. ఆమె ఎంత అరచిన పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమెని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఐతే, నిజంగానే సోనాక్షిని అరెస్ట్ చేశారా ? లేదంటే.. సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియోనా ? అన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సోనాక్షి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శిన్ తన బైక్ ని దొంగాలించారంటూ ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. తర్వాత ఆ వ్యవహారం సీరియస్ అయింది. పోలీసుల వరకు వెళ్లింది. ఐతే, అది సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో మాత్రమే అని తేలింది. నెటిజన్స్ ప్రియదర్శి చీప్ పబ్లిసిటీపై మండిపడ్డారు. ఇప్పుడు సోనాక్షి కూడా పబ్లిసిటీ కోసమే చేసిందా ? అన్నది తెలియాల్సి ఉంది.