తమన్నా పరువు తీసుకొంది
ఇన్నాళ్లు తమన్నా అంటే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మాత్రమే గుర్తుకు వచ్చేది. బిగ్ బాస్ 3 పుణ్యమా అని ఇప్పుడు తమన్నా అంటే తమన్నా సింహాద్రి పేరు కూడా గుర్తుకు వస్తుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొంది. తొలివారం హేమ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. తొలివారం హేమ ఎలిమినేట్ కాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రిని హౌజ్ లోకి తీసుకొచ్చారు.
హౌజ్ లోని సభ్యులతో పాటు, తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులని గెలుస్తానని బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే సందర్భంగా తమన్నా అంది. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తోంది తమన్నా. సోమవారం నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా తమన్న మాటలకు హౌజ్ లో సభ్యులంతా నోరెళ్లబెట్టారు. ఆమెతో వాదనకు దిగడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపంచలేదు. తమన్న నోట్లో నోరు పెట్టడం ఎందుకనే ఆలోచన ధోరణి సభ్యులందరి ముఖాల్లో కనిపించింది. ఆమె వ్యవహారశైలితో సభ్యులు ఇమడలేకపోతున్నారు. షోని చూస్తున్న ప్రేక్షకులకి తమన్నా తీరు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో ఈ వారం ఆమెకి చెక్ పెట్టొచ్చు.