కశ్మీర్‌’పై అమెరికా రియాక్షన్ ఎంటీ ?


ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజన అన్నది భారత్ సొంత వ్యవహారం. కానీ కశ్మీర్ విభజనపై పాక్, చైనాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ విషయం పక్కనపెడితే కశ్మీర్ పై అగ్రరాజ్యం రియాక్షన్ ఎంటీ ? అంటే.. స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐతే, కశ్మీర్ కు మద్దతు పలకాల్సిందిగా భారతీయ అమెరికన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరారు.

ఇదే సమయంలో సీమాంతర ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాకిస్థాన్‌ను కట్టడి చేయాలని ట్రంప్‌ను అభ్యర్థించారు. దీనివల్ల కశ్మీర్‌ సమస్యకు కొంతైనా పరిష్కారం లభించే అవకాశముందని తాము ట్రంప్‌కు వివరించినట్లు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఏఎఫ్‌) ఎండీ సమీర్‌ కాల్రా వెల్లడించారు. మరీ.. భారతీయ అమెరికన్లు కోరిక మేరకు కశ్మీర్ పై అమెరికా స్పందిస్తుందా.. ? భారత్ కు మద్దతు తెలుపుతుందా ?? అన్నది చూడాలి.