నాని సిక్స్ ప్యాక్ విలన్


నేచురల్ స్టార్ నాని 24వ చిత్రంగా ‘గ్యాంగ్ లీడర్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు30నే గ్యాంగ్ లీడర్ రావాల్సి ఉంది. ఐతే, ‘సాహో’ ఆగస్టు15 నుంచి 30కి వాయిదాపడటంతో గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13కి వెళ్లింది. మరోవైపు, నాని 25వ చిత్రంగా ‘వి’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. హీరోగా సుధీర్ బాబు కనిపిస్తారు. అదితిరావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో కోసం నాని సిక్స్ ప్యాక్ చేస్తున్నాడట. సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ గా భయపెట్టబోతున్నట్టు చెబుతున్నారు. హీరోగా మెప్పించిన నాని.. విలన్ గా ఏ రేంజ్ లో ఆకట్టుకొంటాడనేది చూడాలి. ‘వి’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.