రజనీ-కమల్ పొలిటికల్ మల్టీస్టారర్ !


సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి పలు చిత్రాల్లో నటించారు. మరో చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐతే, అంతకంటే ముందు వీరిద్దరు కలిసి రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. అవునూ.. రజనీతో కలిసి రాజకీయాలు చేసేందుకు సిద్ధమని కమల్ ప్రకటించారు. ఆయన తమిళ్ బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి కమల్‌హాసన్‌ సమాధానమిస్తూ… ‘‘సాధ్యమా అంటే ప్రయత్నిస్తే సాధ్యమే. నేను అనేది మనంగా మారితే కచ్చితంగా సాధ్యం. దానిని ఈ రజనీ (చేరన్‌) వచ్చినా చెబుతా, ఆ రజనీ వచ్చినా చెబుతా’’ అన్నారు. రాజకీయాల్లో రజనీకాంత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమనే విషయాన్ని ఆయన పైవిధంగా వెల్లడించారు. ఐతే, రాజకీయాల్లో రజనీ, కమల్ భిన్న దృవాలుగా కనిపిస్తున్నారు. రజనీ ఎన్ డీయే కు సన్నిహితంగా కనిపిస్తున్నారు. కమల్ మాత్రం లెఫ్ట్ పార్టీలని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రజనీ-కమల్ పొలిటికల్ మల్టీస్టారర్ సాధ్యమా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.