సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్
కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం యావత్ దేశాన్ని దిగ్భాంతికి గురి చేస్తోంది. సుష్మా మరణవార్త విని షాక్ అవుతున్నారు. గొప్ప దేశభక్తి కలిగిన సుష్మారాజ్ చివరి ట్విట్ లోనూ అది కనిపించింది. జమ్ముకశ్మీర్ అంశంపై ఆమె ఆఖరి ట్విట్ చేశారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటంపై ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఆమె మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు. ‘‘థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్. థ్యాంకూ వెరిమచ్. నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నాను’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకొన్న సాహసోపేత నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు కొన్ని రాజకీయాలు పార్టీలు మాత్రమే కశ్మీర్ వ్యవహారంపై మండిపడుతున్నాయి. ఐతే, ప్రజలు స్పందన చూసి బీజేపీ శ్రేణులు ఆందనంలో మునిగితేలుతున్నాయి. ఇలాంటి శుభ సమయంలో సుష్మా స్వరాజ్ మరణం కార్యకర్తలని షాక్ కి గురి చేస్తోంది. సుష్మా మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు సంతాపం తెలియజేశారు. మధ్యాహ్నం 3గంటలకు సుష్మా అంత్యక్రియలు జరగనున్నాయి.
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019