దిల్ రాజు చుట్టూ విజయ్ ప్రదక్షిణిలు.. !


ఇండస్ట్రీలో హిట్ మాత్రమే కొలమానం. ఒక్క హిట్ అందలం ఎక్కించేస్తోంది. ఒకే ఒక్క ప్లాప్ పాతాళంలో పడేస్తోంది కూడా. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోలని మించిపోయాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెంటపడ్డారు. ఈ లిస్టులో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ సమయంలోనూ దిల్ రాజు విజయ్ ని కలిశాడు.

ఓ లైన్ చెప్పాడు కూడా. అది బాగుందని చెప్పిన విజయ్.. సినిమా చేసేందుకు ఎస్ గానీ, నో గానీ చెప్పలేదు. దీనిపై సన్నిహితుల దగ్గర దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయ్. ఐతే, ‘డియర్ కామ్రేడ్’ ప్లాప్ తర్వాత విజయ్ తగ్గాడు. ఇటీవల కాలంలో ఆయన రెండు మూడు సార్లు దిల్ రాజు ఆఫీస్ కి వచ్చి వెళ్లినట్టు తెలిసింది. అన్న.. త్వరలోనే మంచి సినిమా చేద్దాం. ప్రస్తుతం క్రాంతి మాధవన్ సినిమాతో బిజీగా ఉన్నా. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. వాళ్లు పూరి దర్శకత్వంలో సినిమాని సెట్ చేస్తున్నారు. ‘హీరో’ సినిమా విషయంలో సమస్యలున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మనం కలిసి సినిమా చేదాం అన్నాడట విజయ్. మొత్తానికి.. విజయ్ తగ్గాడు. ప్లాప్ వల్ల వచ్చిన జ్ఝానోదయం అంటే ఇదేనేమో.. !