అనసూయని తొక్కేశారు.. !


ఈవారం బాక్సాఫీస్ కు మూడు సినిమాలు క్యూ కట్టాయి. మన్మథుడు 2, కథనం, కురుక్షేత్రం. వీటిలో కురుక్షేత్రం డబ్బింగ్ సినిమా. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. మన్మథుడు 2తో కథనం పోటీపడటం సాహాసమే అన్నారు. ఇప్పుడదే నిజమైంది. ఎక్కడ చూసిన రెండో మన్మథుడు గురించే టాక్. మన్మథుడు 2 బాగున్నాడు. బాగా నవ్వించాడు. రకుల్-నాగ్ కెమిస్ట్రీ బాగుంది. మన్మథుడుతో రకుల్ రొమాన్స్ అదిరిపోయిందని చెప్పుకొంటున్నారు.

‘కథనం’ ఎలా ఉంది ? అనే టాక్ మాత్రం బయటకి రావడం లేదు. ట్విట్టర్ వేదికగా ‘కథనం’ టాక్ పై ఒక్క ట్విట్ కనిపించడం లేదు. వెబ్ సైట్లు ముందుస్తుగా కథనం పబ్లిక్ టాక్ ని అందించే ప్రయత్నం చేయడం లేదు. టీజర్, ట్రైలర్’తో మాత్రం కథనం బాగుండనుందనే ఫీల్ కలిగింది. కానీ, ఆ ఎఫెక్ట్ ఫస్ట్ షోతే బయటపడాలి. లేదంటే సినిమాకి డ్యామేజ్ తప్పదు. పోటీలో మన్మథుడు 2 లాంటి పెద్ద సినిమా ఉంది మరీ..! కావాలనే అనసూయని తొక్కేశారా ? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఐతే, సినిమా టాక్ బాగుంటే ‘కథనం’ విజయాన్ని ఎవరూ ఆపలేరు అనుకోండీ.. ! కాకపోతే కథనం టాక్ ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో రివ్యూ వస్తే తేలిపోనుంది.