‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ – నవ్వి నవ్వి సచ్చిపోతారు
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అదించారు. అన్నపూర్ణా స్టూడియోస్, వయకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య రెండో మన్మథుడు ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బినెఫిట్ షోస్ పడిపోయాయి. ప్రేక్షకులు సినిమా టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకొంటున్నారు. ఆ హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ.. !
పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో రెండో మన్మథుడు అంచనాలని పెంచేశాడు. 2002లో విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నాగ్ ‘మన్మథుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్ లు బుల్లెట్స్ లా పేలాయి. ఇప్పటికీ ఆ పంచ్ ల పవర్ ని ప్రేక్షకులు మరచిపోలేదు. కడుపుబుబ్బ నవ్వించేసిన మన్మథుడు చిత్రానికి మన్మథుడు 2 సీక్వెల్ గా భావిస్తున్నారు. రెండో మన్మథుడుకి మన్మథుడుతో కథతో ఎలాంటి సంబంధం లేదు. కానీ, వినోదం మాత్రం ఆ స్థాయిలో ఉంటుందని సినిమా ప్రమోషన్స్ లో నాగ్ చెప్పాడు.
ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు అదే చెబుతున్నారు. రెండో మన్మథుడుని చూసి నవ్వి నవ్వి సచ్చిపోతారు. ఆ రేంజ్ లో వినోదం పండిందని చెబుతున్నారు. నాగ్ మరింత అందంగా కనిపించాడు. 25 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. గతంలో ఎన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లోకనిపిస్తున్నారు. ప్లే బాయ్‌గా కుర్రాళ్లను మించి రొమాన్స్ చేశాడని చెబుతున్నారు. మనం హిట్ కొట్టామ్ బ్రో.. నాగార్జున గారిని ఎంతో యంగ్‌గా చూపించావ్.. కంగ్రాట్స్ బ్రదర్’ అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పొగిడేస్తున్నారు. ఒకట్రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటనలో అదరగొట్టేసింది. ఆమె ఏం చేసిన అద్భుతంగా ఉంది. నాగ్ తో కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని చెబుతున్నారు. ఇక, వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా ట్విట్ చేస్తున్నారు. వెన్నెల కిశోర్ – నాగార్జున మధ్యలో వచ్చే సీక్వెన్స్ సూపర్ ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వీళ్లిద్దరూ కనిపిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారని చెబుతున్నారు. మొత్తంగా.. రెండో మన్మథుడు 2 థియేటర్స్ లో ఫుల్లుగా నవ్వులు. నవ్వులు పంచిన సినిమా ప్లాప్ అయిన దాఖలాలు లేవు. సో.. రెండో మన్మథుడు హిట్టు కిందే లెక్క.
Watched #Manmadhudu2 Whole theatre erupted for the comedy sequences…@23_rahulr Anna
Hitt antheyyy @Rakulpreet Performance iragadeesindi…@vennelakishore Kakha comedy timing
Review: 3.5/5
King is back— Mohaneesh|#Rowdy#Suriya (@comrade_45) August 8, 2019
First half
anta .. #Manmadhudu2
— ch sudheer (@sudheer_4Nag) August 8, 2019
Just watched #Manmadhudu2 . King @iamnagarjuna Garu is d cynosure. Comedy , Emotions, Songs, Story
@Rakulpreet Ji at her best. @vennelakishore is hilarious. especially King n Vennela Kishore scenes needs special mention.
is rocking.Bro @23_rahulr u r here 2 stay
pic.twitter.com/1gM3Yp9MWf
— Sandeep Gundapu (@SandyLovesChay) August 8, 2019