బిగ్ బాస్ హౌస్’లో ఎడిటిట్ సీన్.. వైరల్ !

బిగ్ బాస్ హౌస్’లో రొమాంటిక్ సీన్స్ చాలానే జరుగుతున్నాయి. దంపతులు వరుణ్ సందేష్-వితికా చాటుమాటున రొమాన్స్ చేసుకొంటున్నారు. ఇక, పునర్నవిపై రాహుల్ మనసుపారేసుకొంటున్నట్టు కనబడుతోంది. ఆమెని పరోక్షంగా ప్రమోజ్ చేశాడు కూడా. ఐతే, ఆ సీన్ ని స్టార్ మా ప్రసారం చేయలేదు. బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్ లో చూపించని కంటెంట్ తో బిగ్ బాస్ బజ్ అంటూ స్టార్ మ్యూజిక్ లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంట్లో పునర్నవి-రాహుల్ ల రొమాంటిక్ సీన్ ప్రసారమైంది. ‘పునర్నవితోరాహుల్.. బయటకు పోయిన తర్వాత ఒక రింగ్ ఇచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏమంటావ్ ? అంటూ ప్రశ్నించాడు. ఫస్ట్ నేనేంటో తెలుసుకో.. అంటూ పునర్నవి బదులిచ్చింది. అయినా రాహుల్ వదల్లేదు. నేను జోక్ గానే అడుగుతున్న సీరియస్ గా తీసుకోకుండా.. ఒకవేళ రింగ్ ఇచ్చి ప్రపోస్ చేస్తే ఏం చేస్తావ్ ? అంటూ మరోసారి ప్రశ్నించాడు. దానికి పునర్నవి ”పో.. పోయి పని చూసుకో” అంటూ సమాధానం చెబుతానని చెప్పింది. ఇప్పుడీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ హౌస్’లోకి సింగిల్ గా వెళ్లిన పునర్నవి, రాహుల్ బటికి మాత్రం జంటగా వచ్చేలా కనిపిస్తున్నారు.