మహేష్ బర్త్ డే గిఫ్ట్.. అదిరింది !


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ అందించారు. ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు.

మహేష్ బర్త్ డే కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ ఇంట్రో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ అద్భుతంగా ఉన్నాడు. కాశ్మీర్ షెడ్యూల్ లో చిత్రీకరించిన విజువల్స్ కి దేవిశ్రీ మ్యూజిక్ తోడవ్వడంతో ప్రోమో రిచ్ గా అంచనాలకు తగ్గట్టుగా ఉంది. “సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే దారికి జోహారూ…”అని సాగే థీమ్ సాంగ్ గూస్ బమ్స్ కలిగిస్తుంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకుల ముందుకు రానుంది.