వైకాపాపై భాజాపా ఎటాక్


ఏపీలో చంద్రబాబుని చావు దెబ్బతీయడమే భాజాపా ప్రథమ లక్ష్యం. అది నెరవేరింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. ఇక భాజాపా తదుపరి టార్గెట్ ఏపీలో అధికారంలోకి రావడమే. ఇందుకోసం వైకాపాకు ప్రత్యామ్నాయంగా మారాలని ఆశపడుతోంది. ఇందుకోసం టీడీపీ నుంచి సీనియర్ నేతలని పార్టీలో చేర్చుకొంటోంది. అంతేకాదు.. వైకాపాపై పోరుకు పక్కా ప్రణాఌకలు రచించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంకేతాలిచ్చారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అనవసరమైన విషయాల్లో అత్యుత్సాహం చూపే జగన్‌.. ఇసుక విధానం విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు.