మోత్కుపల్లికి బీజేపీ ఆహ్వానం

మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు బీజేపీ ఆహ్వానం అందింది. ఆదివారం ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కలిసి మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. ఆయన్ని బీజేపీలో చేరాల్సిందిగా కోరారు. అందుకు మోత్కుపల్లి ఆహ్వానించారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు మోత్కుపల్లి ప్రకటించారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేపడుతున్న పనులు బాగున్నాయని ఈ సందర్భంగా మోత్కుపల్లి కితాబిచ్చారు. ఈ నెల 18న మోత్కుపల్లి బీజేపీలో చేరబోతున్నట్టు తెలిసింది.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి.. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఏపీలో చంద్రబాబు ఓటమిని ఆకాంక్షించారు. తిరుపతి వెళ్లి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకొన్నారు. ఏపీలో తెదేపా ఓటమి తర్వాత తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకొన్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని.. అందుకు ప్లాన్ చేసుకొంటున్న భాజాపా మోత్కుపల్లి పార్టీలోకి ఆహ్వానించింది. అందుకు మోత్కుపల్లి సంతోషంగా అంగీకరించారు.