నాని ‘వి’లన్ లుక్ చూశారా.. ?

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’గా మారిన సంగతి తెలిసిందే. మెగా యంగ్ హీరోలకి దక్కని అదృష్టం నానికి దక్కింది. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 13న నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని నటిస్తున్న మరో చిత్రం “వి”. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో నానికి సంబంధించిన చిత్రీకరణ మొదలైంది. సెట్స్‌లో నాని పాత్రకు సంబంధించిన ఫొటోను
చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాయి. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే గెడ్డెంతో ‘వి’లన్ లుక్ లో కనిపిస్తున్నారు నాని.

ఈ చిత్రంలో సుధీర్‌ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదితిరావు హైదరి, నివేదా థామస్ కథానాయికలు. నానికి జంటగా అదితిరావు, సుధీర్ బాబుకి జంటగా నివేదా నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ విడుదలైన నెల గ్యాప్ లోనే ‘వి’ విడుదల కానుంది.