వైరల్ : కోహ్లీ ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’


టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ కాస్త వెరైటీగా బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ చేసి చూపించాడు. సహజంగా ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’ అంటే.. మూత ఉన్న నీళ్ల బాటిల్‌ను ఒక కాలితో తంతూ ఓపెన్‌ చేయడమే. ఐతే, కోహ్లీ మాత్రం తన బ్యాట్‌తో ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు.

‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’లో తన దృష్టినంతా కేంద్రీకరించి.. ఎదురుగా ఉన్న బాటిల్‌ మూతను తన అద్భత బ్యాటింగ్‌ నైపుణ్యంతో తొలగించాడు. ఆ వీడియోకి కోచ్‌ రవిశాస్త్రి బ్యాక్‌గ్రౌండ్‌ కామెంట్రీ అద్భుతంగా సెట్ అయింది. ఈ వీడియోను కోహ్లీ తన ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేశా’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.