ఇస్మార్ట్ ‘బాల్’ రాబోతుంది !


అంతర్జాతీయ క్రికెట్ లో ఇస్మార్ట్ బాల్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. మైక్రోచిప్‌లను అమర్చిన స్మార్ట్‌ బంతుల్ని ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ తయారు చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఇస్మార్ట్ బాల్ ఉపయోగపడనుంది.

బంతి వేగం, నియంత్రణ, కోణం, ఏ పాయింట్‌లో రిలీజ్‌ చేశారు, బంతి పిచ్‌ అయ్యే ముందు బౌన్స్‌ ఎంత, పిచ్‌ అయిన తర్వాత బౌన్స్‌ ఎంత వంటి గణాంకాలను సరికొత్త ఇస్మార్ట్‌ బంతి అందించనుంది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్‌ అవుతోంది?గాలిని బట్టి ఎంత వేగంతో బంతిని విసరాలి ? ఎక్కడ విసిరితే ఎలా టర్న్‌ అవుతుంది ? వంటి వివరాల్ని ఇవ్వనుంది.

ఈ బంతిని మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన టీ20 లీగ్‌ ‘బిగ్‌బాష్‌’ అన్న సంగతివిదితమే. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి ఇస్మార్ట్ బాల్ ని తీసుకురానున్నారు.