జనసేన ఎమ్మెల్యే అరెస్ట్.. విడుదల !
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు అయ్యారు. మలికిపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఆదివారం రాత్రి ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడారు. వారిలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి కూడా ఉన్నారని.. ఆయనను అయినా వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సై పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఐతే, అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు, అనుచరులపై ఎమ్మెల్యే రాపాక మరోసారి పోలీస్ స్టేషన్ కి వచ్చి వారితో కలిసి ధర్నాకి దిగారు.
ఈ నేపథ్యంలో.. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారంటూ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం చింతలమోరిలోని రాపాక ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. తన అరెస్టు తథ్యమని తెలియడంతో చివరకు ఎమ్మెల్యే రాజోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాపాకని బెయిల్ పై రిలీజ్ చేశారు. ఈ మొత్తం ఏపీసోడ్ లో రాజోలులో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.