ప్రభాస్’ని అదొక్కటీ అడక్కండీ.. !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘అదొక్కటీ అడక్కండీ’ అనే బోర్డ్ పెట్టుకొన్నాడు. ఒకవేళ అడిగిన ఆన్సర్ రాదని అర్థమైపోయింది. ఆ ఒక్కటే ఏంటీ ? అంటే మీరు ప్రేమలో ఉన్నారా ? పెళ్లెప్పుడు ?? ఈ ప్రశ్నకు ప్రభాస్ వద్ద సమాధానం లేదు. ఉన్నా.. ఆయన బయటికి చెప్పరు. ఈ నెల 10 నుంచి ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. బాలీవుడ్ కి వెళ్లి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాలీవుడ్ మీడియా కూడా ప్రభాస్ ని ప్రేమ, పెళ్లిపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగింది. కానీ, ప్రభాస్ నుంచి అన్సర్ లేదు.
పైగా ప్రేమ, పెళ్లి విషయంలో మరింత కన్ఫ్యూజన్ లో పడేశాడు. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్.. ‘తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండవచ్చు. లేకపోవచ్చు’ అని రెండు విధాలా ఆన్సర్ వదిలారు. ఇక, అమెరికా అమ్మాయితో పెళ్లి సంబంధం, స్వీటీ అనుష్కతో ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచారు. ఈ రెండు ప్రచారాల్లో నిజంలేదన్నారు. ఫైనల్ గా ప్రభాస్ ని ప్రేమ, పెళ్లిపై ప్రశ్నలు అడగొద్దనే విషయం మాత్రం స్పష్టమైంది. పెళ్లి విషయంలో ప్రభాస్ కి లేని బాధ మనకెందుకు ? అని వదిలేయడమే.. !
ఇక, సాహో ని భారీ స్థాయిలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. వాటిని ఏ మేరకు అందుకుంటది అనేది ఆగస్టు 30న తేలిపోనుంది.