370రద్దుపై ప్రియాంక ఫైర్ !

జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దుపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అత్యధిక రాజకీయ పార్టీలు 370రద్దుకు మద్దతు తెలిపాయి. ఇక, కశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ 370రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీ సీనియర్లు కొందరు 370రద్దుని బాహాటంగానే మద్దతిచ్చారు.

ఐతే, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మాత్రం 370రద్దుకి వ్యతిరేకంగానే ఉంది. తాజాగా 370రద్దుపై తొలిసారి ప్రియాంక గాంధీ స్పందించారు.
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం. నిబంధనలను పాటించకుండా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా కశ్మీర్‌ను విభజించారని ప్రియాంక మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసిందని ప్రియాంక చెప్పుకొచ్చారు.