సంపూ సాయం రూ.2లక్షలు
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబుది గొప్ప మనసు. సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. గతంలో పలుమార్లు వరద బాధితులకి సాయం చేశారు. తాజాగా కర్ణాటక వరధ బాధితులకి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి సంపూ ముందడుగు వేశారు. తన వంతుగా రూ.2లక్షలు ప్రకటించారు.
“ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా ‘హృదయకాలేయం’ నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నా”నని సంపూ ట్విట్ చేశారు.
ఇక, సంపూ తాజా చిత్రం కొబ్బరిమట్ట. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ సొంతం చేసుకొంది. తొలిరోజే పెట్టుబడిలో 80శాతం వసూలు చేసింది. దీంతో సినిమా ఫలితం ఎలా ఉన్న కొబ్బరిమట్ట కమర్షియల్ గా సేఫ్ అని చెప్పవచ్చు.
ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను.#KarnatakaFloods pic.twitter.com/xqelI3sxWj
— Sampoornesh Babu (@sampoornesh) August 13, 2019