‘సైరా’ మేకింగ్ వీడియో.. అదిరింది.. !

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకులముందుకు రావడం దాదాపు ఖరారైంది.

ఈ నేపథ్యంలో సినిమాప్రమోషన్స్ మొదలెట్టింది చిత్రబృందం. ఆగస్టు 15కానుకగా కొద్దిసేపటి క్రితమే సైరా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఇందులో యాక్షన్ అదిరిపోయేలా ఉంది. బాహుబలి మించిన యాక్షన్ కనిపిస్తోంది. దానికితోడు నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. మేకింగ్ వీడియోతో మెగా అభిమానులు సపైజ్ ఇచ్చేశారు. మేకింగ్ వీడియోలోనే బిగ్ బీ అమితాబ్, నయన్, తమన్నా, జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి లుక్ లని చూపించారు. అవి ఆకట్టుకొనేలా ఉన్నాయి.

మేకింగ్ వీడియోతోనే సైరాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయేలా ఉన్నాయి. ఇక, టీజర్, ట్రైలర్ తో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది చూడాలి. మేకింగ్ వీడియాలోనే ఈ నెల 20న మరో టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో ఒకేసారి టీజర్ ని విదలనున్నారు.