ఓ ఇంటివాడు కాబోతున్న హీరో తరుణ్ !
హీరో తరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తరుణ్ కి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం. తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నామని తురణ్ తల్లి, సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తెలిపారు. ఆమె మంగళవారం ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు మండపేట వచ్చారు. ఈ సందర్భంగా తనయుడు తరుణ్ పెళ్లి ముచ్చట చెప్పారు.
ఇక, బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన తరుణ్.. ఆ తర్వాత హీరోగా మారి విజయాలు అందుకొన్నాడు. నువ్వేకావాలి, నువ్వే నువ్వే సినిమాలు తరుణ్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. లవ్వర్ బోయ్ ఓ వెలుగు వెళ్లాడు. ఐతే, ఆ తర్వాత వరుస ప్లాపులతో హీరోగా కొనసాగలేకపోయాడు. తరుణ్ నటించిన ఆఖరి చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఇప్పుడు తరుణ్ చేతిలో ఒక్క సినిమా కూడ లేదు.
ఇక తరుణ్ కోసం అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాం. త్వరలోనే పెళ్లి చేయబోతున్నామని తరుణ్ తల్లి రోజా రమణి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ యేడాదియే తరుణ్ ఓ ఇంటివాడుకాబోతున్నట్టు అర్థమవుతోంది.