బంగారు ఉంగరాలు పంచిన స్టార్ హీరో

అట్లీ దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులకి విజయ్ బంగారు కానుకలు అందజేశారు. సినిమాకోసం పనిచేసిన వారందరికీ బంగారు ఉంగరాలు పంచాడు విజయ్. దాదాపు 400మందికి ఇవి అందాయి. అంతేకాదు.. యూనిట్ సభ్యులందరికీ ఫుట్ బాల్స్ ని పంచారు.

ఈ సినిమా ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీ, విజయ్ సంతకాలు చేసిన ఫుట్ బాల్స్ ని చిత్రబృందానికి పంచారు. దాదాపు 400ల బంగారు ఉంగరాలతో పాటు, 400 ఫుట్ బాల్స్ ని పంచారు. ఈ కానుకలతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఫీలయినట్టు తెలుస్తోంది.

అట్లీ-విజయ్ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన తేరి, మెర్సల్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం బిగిల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. ఆ అంచనాలని అందుకొనేలా బిగిల్ ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే బిగిల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.