ట్విట్టర్ రివ్యూ : రణరంగం


యంగ్ హీరో శర్వానంద్ తాజా చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకుడు. కాజల్ అగర్వాల్, కళ్యాణిప్రియదర్శన్ కథానాయికలు. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆగస్ట్ 15న కానుకగా రణరంగం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదిక సినిమా టాక్ ని షేర్ చేస్తున్నారు. దానిపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

కథ ఎంపిక టేస్ట్ ఉన్న కథానాయకుడు శర్వా. ఎంచుకొన్న కథకి పూర్తి న్యాయం చేయగల ప్రతిభ ఆయన సొంతం. రణరంగం కథ-కథనాలు బాగా కుదిరాయ్. అదే సినిమాకు ప్రధానబలమని చెబుతున్నారు. ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో శర్వానంద్ నటన అదిరిపోయింది.
శర్వా-కల్యాణి ల మధ్య లవ్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఇక, కాజల్ గ్లామర్ తో అదరగొట్టింది.

టెక్నికల్ గా ‘రణరంగం’ బాగుంది. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. 1990 ఏపీసోడ్, ప్రజెంట్ టైం ఏపీసోడ్స్ కి తగ్గట్టుగా నేపథ్య సంగీతం అందించారు. క్లైమాక్స్ బాగుంది. మొత్తంగా రణరంగం పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.