‘మహర్షి’ వందరోజుల కానుక చూశారా.. ?


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించారు. మే9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది. పర్సనల్ గా మహేష్ బాగా నచ్చి, మెచ్చిన చిత్రం అనిపించుకొంది. మహర్షి సక్సెస్ ని మహేష్ ఓ రేంజ్ లో ఎగరేశాడు. ఏకంగా కాలరెగిరేశాడు.

నేటితో ‘మహర్షి’ విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. నెల్లూరు, ఆదోని, చిలకలూరిపేట, గాజువాక, గుంటూరు కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు రూ.207 గ్రాస్‌ (రూ.113 కోట్ల షేర్‌) వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ ని విడుదల చేసింది.

ఈ వీడియోలో మహేశ్‌, పూజా హెగ్డే కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే విలన్‌ పాత్ర పోషించిన కమల్‌ కామరాజు కాలు అడ్డుపెడతాడు. కానీ మహేశ్‌ అతడిని దాటుకుని వెళ్తాడు. ఆ తర్వాత పూజను క్లాస్‌కు పంపించి కమల్‌తో మాట్లాడతాడు. ‘రెండు ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేసి అమ్మాయిలతో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా?’ అని కమల్‌ మహేశ్‌తో పొగరుగా మాట్లాడతాడు. ఇందుకు మహేశ్‌.. ‘అనుకోవడం ఏంటి? హీరోనేగా’ అని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకొంది.