అక్షయ్ ‘ఆగస్టు15’ రికార్డు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రంజాన్ ని వదలడు. ఆరోజున కచ్చితంగా తన సినిమా విడుదలయ్యేలా చూసుకొంటాడు. రంజాన్ కి విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమాలు వందల కోట్లు వసూలు చేశాయి. రికార్డులు సృష్టించాయి. ఇక, అక్షయ్ కుమార్ సినిమా ‘ఆగస్టు15’న రావాల్సిందే. స్వాత్రంత్య్ర దినోత్సవం అక్షయ్ కి బాగా కలిసొస్తుంది.

2016 ‘ఆగస్టు 15’న అక్షయ్ కుమార్ నటించిన #Rustom సినిమా విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు రూ.14.11 కోట్లు కలెక్ట్ చేసింది. 2017 ఆగస్టు 15న #ToiletEkPremKatha రిలీజైంది. తొలిరోజు రూ. 13.10 కలెక్ట్ చేసింది. 2018లో #Gold వచ్చిన గోల్డ్ సినిమా తొలిరోజు రూ. 25.25 కోట్లు వసూలు చేసింది. ఇక, ఈ యేడాది స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన #MissionMangal తొలిరోజు ఏకంగా రూ. 29.16 కోట్లు కలెక్ట్ చేసింది.

జగన్‌శక్తి దర్శకత్వంలో ‘మిషన్ మంగళ్’ తెరకెక్కింది. సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, తాప్సి, నిత్యామీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మిషన్ మంగళ్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. అక్షయ్ సినిమాల తొలిరోజు వసూళ్లలో మిషన్ మంగళ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.