‘సైరా’లో పవన్.. నిజమే !


మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగాస్టార్ ‘సైరా’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. అందులో నిజంలేదు.. సైరా కోసం పవన్ వాయిస్ ఓవర్ అందించారని ఆ తర్వాత తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. సైరా టీజర్ కోసం పవన్ వాయిస్ ఓవర్ చెబుతున్న ఓ ఫోటోని నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ షేర్ చేసింది. ఈ సందర్భంగా పవన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇక, ఈ నెల 20న సైరా టీజర్ ని విడుదల చేయనున్నారు.

ఇక ఇటీవల విడుదలైన సైరా టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ హైలైట్ గా నిలిచింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ నట విశ్వరూపం చూపించబోతున్నాడని మేకింగ్ వీడియోతో అర్థమవుతోంది. ఇక టీజర్, ట్రైలర్ తో సైరా స్థాయి ఏంటన్నదానిపై క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సైరా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.