టీమిండియా కోచ్ మళ్లీ రవిశాస్త్రినే.. !


టీమిండియా కెప్టెన్ కోహ్లీ కోరిక తీరింది. కోచ్ గా రవిశాస్త్రీ తిరిగి ఎన్నికయ్యారు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రీకే మొగ్గు చూపింది. కమిటీ సభ్యులు అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి భారతీయ కోచ్‌కే ఓటు వేశారు. భారత్‌లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు శాస్త్రి ఈ పదవిలో కొనసాగుతారు. ఐతే, కోచ్ ఎంపిక హోరాహోరీగా సాగిందని కపిల్‌ అన్నారు.

పోటీలో రెండో స్థానంలో మైక్‌ హెసన్‌, మూడో స్థానంలో టామ్‌ మూడీ నిలిచారు. రవిశాస్త్రి అగ్రస్థానంలో నిలిచారు. పోటీ మాత్రం చాలా హోరాహోరీగా సాగిందని కపిల్‌దేవ్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మధ్య మంచి సమన్వయం ఉంది. వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు కోచ్‌గా రవిభాయ్‌ను కొనసాగిస్తే బాగుంటుందని విరాట్‌ చెప్పిన సంగతి తెలిసిందే. కోహ్లీ కోరికని కపిల్ కమిటీ తీర్చినట్టయింది. ఇక, సహాయ కోచ్ ల ఎంపికని బీసీసీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేపట్టనున్నారు.